తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లపై సమ్మెలో పాల్గొన్న మహిళ కండక్టర్ దాడి
యాదగిరిగుట్ట పట్టణం: తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె యాదగిరిగుట్ట డిపో వద్ద ఉద్ధ్రిక్తంగా మారింది. బస్సు నడిపేందుకు సిద్ధమైన తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లపై సమ్మెల్లో పాల్గొన్న ఓ మహిళా కండక్టర్ దాడికి దిగారు. చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిపోలోని 470 మంది కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కొందరికి ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయాలనే సూచనల మేరకు ఆర్టీసీ అధికారులు అర్హత కలిగి కొందరు బయటి వ్యక్తులను విధుల్లోకి తీసుకున్నారు. దీంతో డిపో పరిధిలోని 105 బస్సుల్లో 20 బస్సులు కదిలాయి